KRNL: అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల సందర్భంగా దైవందిన్నె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు CM చంద్రబాబు ప్రసంగాలను రైతులు, స్థానికులతో కలిసి వర్చువల్గా వీక్షించారు. అనంతరం నియోజకవర్గంలోని 38,318మంది రైతులకు సంబంధించిన రూ. 25.78 కోట్ల చెక్కును MLA ప్రజలకు అందజేశారు.