ప్రకాశం: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ కనిగిరి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను ఇరువురు చర్చించుకున్నారు. పార్టీ బలోపేతానికి అందరు కలిసి కృషి చేయాలని సూచించారు.