KMR: జీవితంపై విరక్తితో వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన చిట్టి వీరయ్య(72) కొంతకాలంగా అస్తమాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది నెమ్లి అటవీప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tags :