నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా వారి కుమారుడికి ‘నీర్’ అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు. ఇక నీర్ అంటే స్వచ్ఛమైన, దైవత్వంతో నిండిన అపరిమితమైందని అర్థం.