KRNL: కౌతాళం మండల కేంద్రంలో ఇవాళ 58వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20 తేది వరకు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి మధులిన వెల్లడించారు. వారోత్సవాలలో మహిళా దినోత్సవం భాగంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి వారు నివాళులర్పించారు.