NLG: భారత వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి, ఎంజీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కొంపల్లి సూర్య అన్నారు. చిట్యాలలో బుధవారం ‘స్త్రీ శక్తి దివస్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువతులు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని అప్పుడే అణిచివేత వివక్ష తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు.