HYD: జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.