ప్రకాశం: చంద్రశేఖర పురం మండలంలోని శీలం వారి పల్లి గ్రామంలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గ్రామంలో డిజిటల్ వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వ్యవసాయానికి సంబంధించిన వివిధ మొబైల్ అప్లికేషన్స్ ఎలా ఉపయోగించుకోవాలి, వివిధ సాగు, ఇతర మార్కెటింగ్ పద్ధతులు గురించి వివరించారు.