AP: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్రవిడ యూనిర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం వర్సిటీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.