ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం జీటీడబ్ల్యూఎస్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యానికి గురై, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాలికలను బుధవారం ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ పరామర్శించారు. డాక్టర్ సంపత్తో కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్‌ను కోరారు.