ప్రకాశం: జిల్లా జేసీకి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం లభిస్తుందని దివ్యాంగులు అన్నారు. సోమవారం జరిగిన ‘కలెక్టర్ మీకోసం’ కార్యక్రమంలో త్రీ వీలర్ బైక్ కోసం ఎల్ఎల్ఆర్ లైసెన్స్ తీసుకునే విషయంలో రవాణా శాఖలో కొందరు లాబీయింగ్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వారు ఫిర్యాదు చేశారు. జేసీ వెంటనే చర్యలు తీసుకొనటంతో ఆ లాబీయింగ్‌కు చెక్ పడిందని తెలిపారు.