SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్లో ఏర్పాటు చేసిన గ్రీన్ నీడిల్, టెక్స్ పోర్ట్ పరిశ్రమలను ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పరిశ్రమల్లో వస్త్ర తయారీ దశలను మొత్తం పరిశీలించారు. ఎక్కడికి ఎగుమతి చేస్తారు, ఎలా చేస్తారు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.