AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. నదుల అనుసంధానం ద్వారా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపగలిగితే.. ఒక ఏడాది వర్షం పడకపోయినా బ్యాలెన్స్ అవుతుంది. భూమిని ఒక జలాశయంగా మార్చాలి’ అని అన్నారు.