హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. దేశంలోని మహిళలందరూ, ముఖ్యంగా హిందూ మహిళలు.. తమ ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై వీలునామా రాసుకోవాలని తెలిపింది. తద్వారా భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉంటాయని పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే.. ఆమె భర్త, పిల్లలు కూడా లేకపోతే ఆస్తి మొత్తం తల్లిదండ్రులకు వెళ్తుంది.