AP: రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో ఆయన పర్యటించి మాట్లాడారు. ‘నదుల అనుసంధానం చేసి ప్రత ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాం. పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే.. రైతులకు ఇబ్బందులు వస్తాయి. మనం పండించిన పంటలను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి. అలా అయితేనే ఆదాయం వస్తుంది’ అని పేర్కొన్నారు.