KMR: మద్నూర్ మండలంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రం గురువారం అమావాస్య సందర్భంగా మూసి ఉంటుందని సీసీఐ, మార్కెట్ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రం శుక్రవారం నుంచి యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.