KRNL: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకంతో పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9,662 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు ఏవో సుచరిత ఇవాళ స్పష్టం చేశారు. ఒక్కొక్క రైతుకు రూ. 7,000 చొప్పున రూ. 6.54 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని తెలిపారు. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.1.71 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద రూ. 4.83 కోట్లు జమ అవుతాయన్నారు.