వాట్సాప్లో తీవ్రమైన భద్రతా లోపం ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల సుమారు 350 కోట్ల మంది కాంటాక్స్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హ్యాకర్లు లేదా ఇతరులు భారీ ఎత్తున ఫోన్ నంబర్లు తస్కరించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా పరిశోధకులు తెలిపారు. వెంటనే వాట్సాప్ నిర్వాహకులు ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.