KMM: తిరుమలాయపాలెం మండలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పార్టీ కార్యకర్తలతో సమావేశమై, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ఇటీవల మృతిచెందిన కిలారి నరసయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించి వారిని ఓదార్చారు.