ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ఛధారి ఖానాపూర్ సబ్ సెంటర్ పరిధిలోని కోలాంగూడ గ్రామంలో పీ.ఎం. జన్మన్ ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సర్ఫరాజ్ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు పవర్ ప్రేమసింగ్, సత్యవతి, శైలజ, MLHP ఆకాంక్ష, చంగున ఉన్నారు.