NDL:పేదింటి మహిళలను లక్షాధికారిగా చేయడమే మా లక్ష్యం అని శిల్పా సేవా సహకార సంఘం ఛైర్మన్ నాగిని రవి సింగారెడ్డి తెలిపారు. పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో ఇవాళ శిల్పా మహిళా సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రుణాల చెక్కులను నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు.13,000 మంది లబ్ధిదారులకు రూ. 23 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు.