ASF: చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున పాఠశాలల సమయాన్ని తగ్గించాలని DYFI జిల్లా నాయకులు పురుషోత్తం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రెబ్బెన MEO కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వటు మాట్లాడుతూ.. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండడంతో పాఠశాల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగించాలని కోరారు.