NRML: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, మహిళలు, చిన్నారులు, వర్గాలు, ధార్మిక భావాలు, ప్రభుత్వ అధికారులు మొదలైన వారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు, అపోహలు పుట్టించే పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం ప్రకటనలో హెచ్చరించారు.