GDWL: విద్యార్థులు చదువుతోపాటు కళా నైపుణ్యం కలిగి ఉండాలని గద్వాల డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు .58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం లైబ్రరీ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు ఆదేశంతో స్థానిక సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.