MDK: చేపల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కాట్రియల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల నాగేష్ అన్నారు. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మత్స్యశాఖ అందించిన స్థానిక చిన్న చెరువులో 2లక్షల 30 వేల చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బైగారి కుమార్, మద్ది నర్సింలు, రాజు, మహేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.