GDWL: వృద్ధుల జీవిత అనుభవాలను మనం గౌరవించి పాటిస్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలను సాధించగలరని గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం గద్వాల ఐడీవోసీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులను ఇంటిపట్టున పెట్టుకుని వారి సలహాలు సూచనలు పాటించాలన్నారు.