SRD: అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సిబ్బంది అందరూ కలిసి కేక్ కట్ చేసి పురుషుల దినోత్సవ సంబరాన్ని ఆనందంగా జరిపారు. కుటుంబం, సమాజంలో పురుషుల పాత్ర వంటి అంశాలపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు జరిపినట్లు లలిత కుమారి తెలిపారు.