రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీరల పంపిణీ కార్యక్రమం విషయం స్థానిక ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి వారిని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.