NTR: తిరువూరు మండలంలోని వినగడప సమీపంలో కట్లేరు వాగుపై వంతెన 2018 వరదలకు కూలిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా నిర్మాణం జరగలేదు. భారీ వర్షాలకు రాకపోకలు నిలిచిపోయి, ఆంధ్ర, తెలంగాణలకు చెందిన 100 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు, రైతులు నరకం అనుభవిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు వేడుకుంటున్నారు.