ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ లోని అయ్యప్ప స్వామి గుడి బజార్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉందని, ట్రాఫిక్ ఎస్సై, సిబ్బంది ఉన్న ఈ విషయంపై దృష్టి పెట్టలేదన్నారు. పోలీసులు వన్‌వే ట్రాఫిక్ కొనసాగిస్తే మంచిదని పట్టణ ప్రజలు, వాహనదారుల విజ్ఞప్తి చేస్తున్నారు.