SKLM: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కె.శ్రీనివాస్ అన్నారు. సారవకోట మండలం గుమ్మపాడు పంచాయతీ అశోకం గ్రామంలో రైతు సంబర సభలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు.