KRNL: ఆదోని పోలీసు సబ్ డివిజన్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని ఇవాళ డీఎస్పీ హేమలత అన్నారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశామన్నారు. రోజు 10 కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని, ఆటో డ్రైవర్ల్లో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.