గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో ఏ రోజూ వెనుకడుగు వేయకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. నగరంలోని శారద కాలనీలో రూ.21 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజ్ నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.