VSP: విశాఖలోని గోపాలపట్నం, 52వ వార్డు గణేష్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు బుధవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీ వివరాలను, పిల్లలు, గర్భిణుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.