MBNR: సీఎం రేవంత్ రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఫైలును రాబోయే కేబినెట్ మీటింగ్లో పెట్టి ఆమోదించాలని కోరారు. అలాగే ఇందిరమ్మ యాప్లో ఉన్న సాంకేతిక సమస్యలు తొలగించి ఆ బిల్లులను సత్వరమే క్లియర్ చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.