NRML: తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ తల్లి డీఈవోకు బుధవారం వినతి పత్రం సమర్పించింది. మృతుని తల్లి వివరాల ప్రకారం.. బీర్నంది గ్రామానికి చెందిన రాజు పాఠశాల సిబ్బంది ఒత్తిడి, పత్రికల్లో అనవసర ప్రచారం కారణంగా మృతి చెందాడని, మృతికి కారకులైన ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.