ASF: యువత ఉన్నత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ అన్నారు. బుధవారం కెరమెరి పోలీస్ స్టేషన్ పరండోలి జట్టుకు వాలీబాల్ కిట్ అందజేశారు. వాలీబాల్ పోటీల్లో పరండోలి జట్టు ఉత్తమ ప్రతిభ కనపరిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, NHRC జిల్లా ఛైర్మన్ రమేష్ పాల్గొన్నారు.