BDK: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో వీసీ సమావేశం బుధవారం జరిపారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో, సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని అన్ని శాఖల అధికారులకు వారు ఆదేశించారు.