VZM: జిల్లాలో సోలార్ విద్యుదీకరణను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. ‘సూర్య ఘర్’ పథకం అమలుపై ఇవాళ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 5వేల జనాభా కలిగిన 6 గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయగా, ఎక్కువ సంఖ్యలో సోలార్ ప్యానెల్లు అమర్చిన బొద్దాంను ఆదర్శ సోలార్ గ్రామంగా ఆమోదించామన్నారు.