NRPT: చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని బుధవారం నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్ టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.