NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ ACP వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో విశ్రాంత ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ మేరకు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఏంటో తెలియజేశామన్నారు. ఆర్మూరు సీఐ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.