నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’. ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత పాత్రపై మాట్లాడుతూ.. పాత్రలో నటించిన వారిని కాదని.. పాత్రను మాత్రమే చూడాలని అన్నాడు.