NLG: ఉల్సాయిపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రైతులు కేంద్రాన్ని వినియోగించుకుని, ప్రభుత్వం సన్న వడ్లకు అందిస్తున్న రూ.500 బోనస్ పొందాలని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.