KNR: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పోషణ, సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, వయోవృద్ధులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.