SKLM: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్యెల్యే శంకర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో బుధవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) 33వ వార్షికోత్సవ వేడుకలను జిల్లా సంఘ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి, జర్నలిస్టులను సన్మానించారు.