KRNL: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ ఏ.సిరి, SP విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు.