HNK: నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన సిద్దేశ్వర ఆలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తీకమాసం, చతుర్దశి తిథి, బుధవారం సందర్బంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం మరియు కాశ్మీర ఫలాలతో మహానివేదన చేశారు. కార్తీకమాసం ముగుస్తుండడంతో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, స్వామివారికి పూజలు చేస్తున్నారు.