తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘నేను వేదికపైకి రాగానే.. రైతులు తమ చేతికండువాను గాల్లోకి ఊపారు. నేను రావడానికి ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చిందని ఆ దృశ్యం చూడగానే అనిపించింది’ అని రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.