KDP: పులివెందులలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత కింద 41,980 మంది రైతులకు పెట్టుబడి సాయం జమ అయిందని బిటెక్ రవి తెలిపారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సీఎం చంద్రబాబు మాట ప్రకారం రైతులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. గతంలో రైతుల కన్నీళ్లు చూశామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతోందని అన్నారు.