MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. NCC 8వ బెటాలియన్ శిక్షణ శిబిరంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో IRCS ఛైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, రక్తదానంతో ప్రాణాలు కాపాడోచ్చని తెలిపారు.